Claculation of Electricity Load in House

 *విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి:*


విద్యుత్ వినియోగదారులకి తెలియచేయునది ఏమనగా,  ఒక ఇంట్లో ఉపయోగంలో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ వినియోగించే మొత్తం ఎనర్జీని లోడ్ అంటారు. 

ప్రతి వినియోగదారుడు సాధారణంగా ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలు వాట్టేజ్ క్రింద ఇవ్వడం జరిగింది.

1. బల్బ్ --   5 to 60 వాట్స్.

2. సీలింగ్ ఫ్యాన్ -- 50 - 150 వాట్స్.

3. టీవీ  -- 150 - 250 వాట్స్.

4. ఫ్రిడ్జ్ --  60 - 250 వాట్స్.

5. సింగిల్ ఫేజ్ మోటార్ పుంపు -- 375 - 1500 వాట్స్.

6. మిక్సీ - 150 - 750 వాట్స్.

7. వాటర్ హీటర్ -- 550 - 1500 వాట్స్.

8. కంప్యూటర్ -- 100 - 250 వాట్స్.

9. ఎయిర్ కండిషనర్ --  1000 - 3000 వాట్స్.


ఉదాహరణకు ఒక వినియోగదారుడి ఇంట్లో 4 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ మరియు ఒక ఫ్రిడ్జ్ ఉన్నాయి అనుకుంటే వీటన్నింటి లోడ్  ఎలా లెక్కించాలో చూద్దాం..


4×9W       = 36W

2×125w   = 250W

1×250w   = 250W

1×200w   = 200W

total  -------- 736W

ఈ విధంగా సదరు వినియోగదారునికి అవసరమయ్యే లోడ్ 736W లేదా 0.736KW గా లెక్కగట్టి చెప్పొచ్చు.


సాధారణంగా వినియోగదారుడు విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో  వాడుతున్న ఉపకరణాల సామర్థ్యాన్ని బట్టి లేదా సదరు వినియోగదారుడు కోరుకున్న లోడ్ తో విద్యుత్ అధికారులు సర్వీస్ మంజూరు చేస్తారు, దీన్నే ఒప్పంద లోడ్ అంటారు. కాలానుగుణంగా వినియోగదారుడు ఉపయోగించే ఉపకరణాల సంఖ్య పెరగడం వల్ల గానీ లేదా వాటి సామర్థ్యం పెరగటం వల్ల గానీ సదరు వినియోగదారుకు మంజూరు అయిన లోడ్ కంటే అదనపు లోడ్ పడుతుంది. ఇలా అదనంగా పెరిగిన లోడ్ కొరకు వినియోగదారులు అందుకు తగిన డెవలప్మెంట్ ఛార్జీలు మరియు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి వారి యొక్క ఒప్పంద లోడ్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఈవిధంగా నవంబర్/డిసెంబర్ - 2020 నెలలో అదనపు లోడ్ వినియోగిస్తున్న కొందరు వినియోగదారులను గుర్తించి వారి లోడ్ పెంచడం కొరకు అవసరమయ్యే డెవలప్మెంట్ ఛార్జీలు మరియు సెక్యూరిటీ డిపాజిట్ వివరాలు ఫిబ్రవరి/మార్చి నెలలో జారీ చేసిన  బిల్లులలో పేర్కొనడం జరిగింది. అదనపు చార్జీలు చెల్లించిన వినియోగదారుల లోడ్ అదే నెలలో పెంచడం జరిగింది మరియు చెల్లించని వినియోగదారుల చార్జీలను ఏప్రిల్ నెలలో జారీ చేసిన బిల్లులో జతచేసి లోడ్ కూడా పెంచడం జరిగింది. కావున వినియోగదారులు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆందోళన చెందకుండా సందేహాలు నివృత్తి చేసుకొని సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థ పురోగతిలో భాగమవ్వగలరని మనవి.


*మరింత సమాచారం కొరకు మీ దగ్గర్లో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని/ సంబంధిత సెక్షన్ AE గారిని సంప్రదించగలరు*


- కాసం నిఖిల్ అసిస్టెంట్ ఇంజనీర్

Comments

Popular posts from this blog

Quotes of the day

Quotes of the day